ఎన్నికలకి ముందు టీడీపీ ని భూ స్థాపితం చేస్తామని వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి 11 సీట్లకు పరిమితమయ్యారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ వీరాంజనేయ స్వామి మీడియా ముఖంగా వెల్లడించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. బెంగళూరు లో కూర్చొని విమర్శించే స్థాయి జగన్ ది కాదు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. మేం తీసుకు వచ్చిన పరిశ్రమలు చూసి క్రెడిట్ చోరీ అంటున్నారు.వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు.