ఆకాంక్షిత బ్లాక్ లో భాగంగా జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుండి నీతి అయోగ్ సి.ఈ.ఓ. రజత్ కుమార్ సైని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నీతి అయోగ్ క్రింద చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్షించారు. ASF కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. తిర్యాణి బ్లాక్ లో నీతి అయోగ్ లో భాగంగా గిరిజన గ్రామాలలో మౌలిక వసతులు,నైపుణ్యత శిక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.