మునిపల్లి: కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకోల్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సంచులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.మొత్తం 597 సంచులు (298 క్వింటాళ్లు) బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.బియ్యం యజమాని విజయవాడకు చెందిన రమేష్ మరియు లారీ ఓనర్ సిద్ధప్ప డ్రైవర్ సునీల్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈసందర్భంగా డిఎస్పి పండరి మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దాడులలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పండరి ఎస్సై వెంకటేశ్వర్లు డిటి ప్రభాకర్ ఉన్నారు.