సూర్యాపేట: పోరాటయోధుల స్ఫూర్తితో ఉద్యమించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి
సూర్యాపేట జిల్లా: పోరాటయోధుల స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి మంగళవారం అన్నారు. మంగళవారం నాగారం మండలంలోని పలు గ్రామాల్లో పోరాటయోధుల స్తూపాలు చిత్రపటాలకు జోహార్లు అర్పించి మాట్లాడారు. నిజాం కాలంలో తెలంగాణ పల్లెల్లో భూస్వాముల జమిందార్ల జాగిదారుల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వెట్టిచాక విముక్తి కోసం సాయుధ పోరాటం జరిగిందన్నారు.