సూర్యాపేట: ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెలిసిన వివరాల ప్రకారం ఆర్ఎంపీ వైద్యుడు చికిత్స వికటించి బాలిక సుహాన మృతి చెందింది బాలికకు చికిత్స అందించిన తర్వాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికి బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.