అసిఫాబాద్: హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి:ప్రజాసంఘాల డిమాండ్
దహేగాం మండలంలో తలండి శ్రావణి హత్యకు పాల్పడిన మామ శివార్ల సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు కోట శ్రీనివాస్,ఆనంద్ లు డిమాండ్ చేశారు. శనివారం దహేగాం గేర్రె గ్రామంలో మామ చేతులో హత్యకు గురైన శ్రావణ అంత్యక్రియల్లో ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మీడియాతో మాట్లాడారు కొడుకు కులం తక్కువ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కక్షపూరితంగా గర్భిణీ మహిళ అనికూడా చూడకుండా గొడ్డలితో అతి కిరాతకంగా దాడిచేసి హత్య చేయడం దారుణమైన విషయమన్నారు.