రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ పి హెచ్ టి యు పి సి లలిత అరుణ ఆధ్వర్యంలో కొత్తగా అమల్లోకి వచ్చిన డయల్ 112 పై నాచారం వెస్లీ స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు,బాల్య వివాహాలు, మహిళలు, పిల్లల భద్రతాత ఇతర అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సహాయానికి ఇకనుంచి 112 డయాల్ చేయాలన్నారు.