ఆళ్లగడ్డ లో గుర్తు తెలియని వ్యక్తి,మృతదేహం లభ్యం
ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. అభిరుచి హోటల్ వెనుక ఉన్న గని గుంతలో నీటిపై తేలియాడుతూ కనిపించింది. మృతుడి వయస్సు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నలుపు, ఎరుపు గీతలు ఉన్న ఫుల్ హ్యాండ్ చొక్కా, ఆకుపచ్చ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9121101164 ( సీఐ ), 9121101203 ( ఎస్సై ) నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు.