పులివెందుల: జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల కైనా పోవాలి లేదా రాజీనామా చేయాలి : రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి
Pulivendla, YSR | Sep 24, 2025 పులివెందుల అసెంబ్లీ శాసన సభ్యులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల కైనా పోవాలి లేదా రాజీనామా అయినా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే ,అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడేటందుకు మైకు ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా లేకుంటే పోను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని,ఇది పసలేని వాదన అని, చిన్న పిల్లాడి చేష్ట ల వంటివని తులసి రెడ్డి అన్నారు.