ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఓర్చుకోలేక కొందరు కోర్టుకు వెళ్తున్నారన్న మంత్రి అనగాని
సత్యసాయి జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగలా ప్రకటించి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటల్లో నిమగ్నమై ఉంటే దీనిని కూడా ఓర్చుకోలేని కొందరు రాజకీయం చేస్తూ కోర్టులకు వెళుతున్నారని రాష్ట్ర రెవిన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సత్య సాయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఉప సంఘం లో బాధ్యులుగా ఉన్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్ మంగళవారం పుట్టపర్తికి విచ్చేశారు.