కనువిందు చేస్తున్న నల్లమల అందాలు
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
వర్షాలతో నల్లమల అడవులు పొగమంచుతో కమ్ముకొని అద్భుతంగా కనిపిస్తున్నాయి. నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారికి ఊటీ, కొడైకెనాల్ను తలపించే ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తోంది. పచ్చటి అడవి మధ్య పొగమంచు పరచిన ఈ దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు అంటే అతిశయోక్తి కాదు. మంగళవారం నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారి వెంట ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో ఈ అందమైన దృశ్యాలను బంధించారు