పోచంపల్లి: జూలూరు బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి వాగు, రాకపోకలను నిలిపివేసి బారిగేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు బ్రిడ్జి వద్ద మూసి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువన కురిసిన భారీ వర్షాలకు జూలూరు బ్రిడ్జి వద్ద లోడ్ లెవెల్ బ్రిడ్జి పై నుండి మూసి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేసి ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా బారిగేట్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.