మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె మండలం రవ్వలకొండలో మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి రాయల్టీ బిల్లులు, లీజులు కట్టకుండా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి యథేచ్ఛగా కొల్లగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తామన్న కూటమి ప్రభుత్వం సంపదనంతా మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. గ్రావెల్ కోసం వెళ్తే ట్రిప్పుకు రూ.1,200 మంత్రి వసూళ్లు చేస్తున్నారన్నారు.