మార్కాపురం: శివరాంపురం గ్రామంలోని శివాలయంలో కార్తిక సోమవారం ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం శివరాంపురం గ్రామం గుంటికా నది ఒడ్డున వెలసిన శివాలయంలో భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం సోమవారం కావడంతో తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. కయా కర్పూరం నైవేద్యంగా సమర్పించి మెక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.