ఫరూక్ నగర్: షాద్ నగర్ పరిధిలో ఆలయం పై దాడి ఘటన తీవ్రమైన అంశం.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి డీకే అరుణ ఎంపీ
రాష్ట్రంలో మతకలహాలు సృష్టించడం లో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. నిన్న షాద్ నగర్ పరిధిలో ఓ పురాతన శివాలయం పై దాడి చేసి శివలింగం ను ఎత్తుకెళ్లారని అది ఇప్పటి వరకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు డీకే అరుణ