వెంకటగిరి : హైవేపై ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి వెంకటగిరి-ఏర్పేడు హైవేపై బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి మండలం పాపనపల్లెకు చెందిన మణికంఠ, పవన్ కుమార్ (20) నెల్లూరు నుంచి బైకుపై ఇంటికి బయల్దేరారు. వాంపల్లి సమీపంలోని ఆంజనేయపురం వద్ద శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్, బైకు ఢీకొన్నాయి. మణికంఠ స్పాట్లోనే చనిపోయాడు. పవన్ కుమార్కు వెంకటగిరి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి తిరుపతికి తీసుకెళ్తుండగా మధ్యలో చనిపోయాడు.