కుప్పం: డీకేపల్లి చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కుప్పం మున్సిపల్ పరిధిలోని డికెపల్లి చెరువులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో కుప్పం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.