శంకరంపేట ఏ: అటవీ శివారులో ఆడ శవం! వివరాలు తెలిస్తే సంప్రదించండి - నిజాంసాగర్ ఎస్సై
అటవీ శివారులో ఆడ శవం! వివరాలు తెలిస్తే సంప్రదించండి - నిజాంసాగర్ ఎస్సై జక్కాపూర్ అటవీ శివారు ట్రెంచ్ లో 14 - 18 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం గురువారం లభించిందని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ అన్నారు. తెలుపు రంగు గల యువతి ఎత్తు 5.0 ఫీట్లు, మెరూన్ కలర్ లెగ్గిన్, అకు పచ్చ రంగు పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ గల టాప్ ధరించి, బూడిద రంగు శాలువా వేసుకొందన్నారు. కాళ్లకు పట్టీలు, నడుముకి మొలతాడు, కుడి కాలికి నల్ల దారం కలదన్నారు. గుర్తు పడితే నిజాంసాగర్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.