పెద్దపంజాణి: మండలం సామాజిక మధ్యమాల్లో సోమవారం ఓవీడియో వైరల్ అయింది. చలమంగళం నందు పనిచేస్తున్న వీఆర్వో తలారి ఈశ్వరయ్య ఇంటి పట్టాలు, పాసు పుస్తకాలు తీసిస్తానని వేలకు వేలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన బాధితులు తమ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆయన్ను కోరగా మంగళవారం కంటే మీ పని చేసిస్తానని బదులిచ్చాడు. బాధితులు ఇలాంటి మంగళవారాలు ఎన్నో చూసాము తమ డబ్బు తమకి ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డారు. గతంలో చౌడేపల్లి మండలం బోయకొండలో పనిచేసేటప్పుడు అక్కడ ప్రజల నుండి సుమారు 10 లక్షల వరకు ఇలానే వసూలు చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.