తాళ్లూరు లిఫ్టుకు 52 కోట్ల కేటాయించి క్యాబినెట్ ఆమోదం చేయించిన నాయకుడు చంద్రబాబు : ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
అమరావతిలోని అసెంబ్లీలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి అతి కీలకమైన అంశం ఇరిగేషన్ ప్రాజెక్టులు అని రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు 97 వేల కోట్లు అవసరమని ఆ నిధులు సమకూర్చి పూర్తి చేయగల సమర్థత, సత్తా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని తాళ్లూరు లిఫ్టుకు చంద్రబాబు 52 కోట్ల కేటాయించి క్యాబినెట్ ఆమోదం చేయించి వర్క్ ఆర్డర్ కూడా ఇప్పించి క్యాబినెట్ ఆమోదం చేయించినందుకు నెహ్రూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.