జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉచిత బస్సు పథకం వల్ల బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉంటున్నారని, ప్రయాణికులు కండక్టర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఆర్టీసీ బస్సుల్లోనే మా ఊపిరి పోయేలా ఉంది' అని ఆమె అన్నారు.