ధర్మపురి: కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది: పట్టణంలో మాట్లాడిన మంత్రి దామోదర రాజనర్సింహ
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు