గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలంలో బాధితురాలికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే థామస్
కార్వేటినగరం మండలం చౌటూరులో ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు గ్రామానికి చెందిన జ్ఞానమ్మ గృహం కూలిపోయింది. ఈ నేపథ్యంలో బాధితురాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం పరామర్శించారు. ఆమెకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ గృహం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.