రోడ్డు ప్రమాదాల నివారణ నిమిత్తం చర్యలు చేపట్టిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాల్యం లోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలో నిత్యం నిద్రమత్తులో రోడ్డు ప్రమాదంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు అరికట్టడానికి సిఐ కత్తి శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాలు మేరకు ఎస్సై టి ప్రసాద్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు నలగంపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఎస్సై టి ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బందితోపాటు వాహనాలు తనిఖీలు అలాగే ఫేస్ వాష్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఐదు నిమిషాలు పాటు నిలబెట్టి ఫేస్ వాష్ చేయించారు.