ఉదయగిరి: వరికుంటపాడు మండలంలో భారీ వర్షం సచివాలయంలోకి వచ్చి చేరిన వర్షపునీరు ఇబ్బందులు పడ్డ సిబ్బంది
వరికుంటపాడు సచివాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం విధులకు హాజరైన ఉద్యోగులు వర్షపు నీటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. చెత్తచెదారం కూడా రావడంతో దుర్వాసన వస్తోందని వారు ఆవేదన చెందారు. సామాగ్రి కూడా నీట మునిగిందన్నారు. నూతన సచివాలయం ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరారు