అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన కేపిహెచ్బి ఎల్ఐజి నాలుగవ ఫేస్ లో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూటివ్ జరగడంతో ఎలక్ట్రిక్ బైక్, మరో బైక్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.