మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతు సంఘం నాయకులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏపీ ఎన్జీవో భవన్ నందు రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఏమి లేదని వారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని త్వరితగతిన పనులను ప్రారంభించాలని కోరారు.