ఖమ్మం అర్బన్: ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన రక్తదాన శిబిరాల్లో 500 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 225 మంది నుంచి వైద్య సిబ్బంది రక్తాన్ని సేకరించారు.