జనగాం: జనగామ కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు,జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా బుధవారం జనగామ కలెక్టరెట్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రభుత్వ విప్,ఆలేరు MLA బీర్ల అయిలయ్య ముఖ్య అతిధిగా విచ్చేయగా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్,అదనపు కలెక్టర్ బెన్ష లోమ్,డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పూలబొకే ను అందించి ఘన స్వాగతం పలికిన అనంతరం పోలీస్ అధికారుల నుండి ముఖ్య అతిధి గౌరవ వందనం స్వీకరించారు.ప్రభుత్వ విప్,MLA బీర్ల అయిలయ్య జాతీయ జెండా ను ఆవిష్కరించిన పిమ్మట ముఖ్య అతిధి తో పాటు ఇంచార్జ్ కలెక్టర్లు పింకేష్ కుమార్,బెన్ష లోమ్,DCP,ZP CEO మాధురి షా,RDO అమరవీరుల స్తూపనికి నివాళులు అర్పించారు.