పుట్టపర్తికి చేరుకున్న సత్యసాయి శత జయంతి ఉత్సవ కమిటీ బృందం
భగవాన్ శ్రీసత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టిన పనుల పరిశీలనకు కమిటీ బృందం మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శ్రీసత్య సాయి విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు యంటి కృష్ణ బాబు, అజయ్ జైన్ లకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసి మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి మంత్రుల బృందం, ప్రత్యే