మర్రిపాడు గ్రామ సమీపంలో పోలీసులు మెరుపు దాడులు, 5మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో వెల్లి శుక్రవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పేకాడుతున్న 5మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు, రూ.50,500 నగదు స్వాధీనం చేసుకుని రిమాండు కు తరలించినట్లు వాల్మీకిపురం సీఐ రాఘవ రెడ్డి మీడియా కు తెలిపారు. సీఐ మాట్లాడుతూ వాల్మీకి పురం సర్కిల్ పరిధిలో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు