వైఎస్ఆర్సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి డివిజన్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయం లో నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీలు, 50 డివిజన్ల పరిధిలో కొత్తగా కమిటీలను నవంబర్ 16వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు.