సంగారెడ్డి: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి: సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని మండల విద్యాధికారి విద్యాసాగర్ సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన భోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కనీస సామర్థ్యాలు పరిశీలించాలన్నారు