మేడ్చల్: ఉప్పల్ రామంతపూర్ లో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
ఉప్పల్ రామంతపూర్ కేసీఆర్ నగర్ లో గడ్డం అరుణ్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై, తీవ్ర మానసిక వేదనతో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.