సీసీఐ కోనుగోలు కేంద్రాలతోనే పత్తి కోనుగోలు చేపట్టాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి అన్నారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాలోఅనుమతి లేకుండా పుట్ట గొడుగల్ల పుట్టుకొచ్చే దుకాణాలు. పత్తి అక్రమంగా కోనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అనుమతి లేకుండా పత్తి కొనుగోలు చేసే దుకాణాల పైన మార్కెట్ కమిటీ అధికారులుతాగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కాపాస్ కిసాన్ యాప్ వినియోగం పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన కోరారు.