ఒంగోలు డివిజన్ ప్రభుత్వ ఖాజీ గా మౌలానా ఆరిఫ్ నియామకం. ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన అరీఫ్
Ongole Urban, Prakasam | Nov 2, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు డివిజన్ పరిధిలో ముస్లిం సామాజిక వర్గానికి నిఖా (వివాహాలు) జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగరానికి చెందిన మౌలానా షేక్ ఆరిఫ్ ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ముస్లిం వివాహలు జరిపించేందుకు ఖాజీ (పురోహితులు)గా తనను సిఫార్సు చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుని మౌలానా ఆరిఫ్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు ఖాజీగా విధులు నిర్వహించేందుకు తనను నియామకం చేసిందని అన్నారు