పలమనేరు: పెళ్లయిన పది రోజులకే కనిపించకుండా పోయిన నవవధువు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబీకులు
బైరెడ్డిపల్లి: మండలం పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. గంగినాయనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తఇండ్లు గ్రామంలో నివాసముంటున్న మంజమ్మ కుమార్తె లక్ష్మిదేవికి పది రోజుల క్రితం వివాహం జరిపించగా ఈనెల 26వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు స్థానిక పోలీసుస్టేషన్లో తన కూతురు కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. ట్రైనింగ్ ఎస్సై జయశ్రీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.