మంత్రాలయం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత : కోసిగి వైసీపీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి
కోసిగి:ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని వైసీపీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.వైసీపీ అధినేత జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం కోసిగి లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తెచ్చిన పీపీపీ విధానం వలన పేదలకు వైద్య విద్య, ఉచిత వైద్య దూరమవుతుందన్నారు. పీపీపీ విధానాన్ని వైసీపీ అడ్డుకుంటుందన్నారు.