నార్కెట్పల్లి: చిన్నకాపర్తి లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో రూ. 20.00 లక్షల రూపాయలతో నూతన నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ ను & రూ. 12.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు.