కళ్యాణదుర్గంలోని మారంపల్లి కాలనీకి తలారి నాగరాజును హత్య చేసిన ఘటనలో నిందితుడు బోయ రాజశేఖర్ కు అనంతపురం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సత్యవాణి శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడు బోయ రాజశేఖర్ కు యావజ్జీవ కారాగార శిక్ష శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసు పూర్వపరాల్లోకి వెళితే 20.07.2020 లో జూదం ఆడుతున్న సమయంలో డబ్బు విషయంలో బోయ రాజశేఖర్- తలారి నాగరాజు మధ్య గొడవ జరిగింది. నాగరాజును కట్టితో మోది చంపేశాడు. శుక్రవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో నిందితునికి యావజ్జీవ శిక్ష విధించారు.