గద్వాల్: గుర్రంగడ్డ పాఠశాలకు ఇద్దరు వాలంటీర్లు నియామకం: కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్
గద్వల జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం గద్వాల మండలం గుర్రంగడ్డ ప్రాథమిక పాఠశాలను జిల్లా సెక్టోరల్ అధికారి హంపయ్య, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. గ్రామస్థుల సమక్షంలో ఇద్దరు వాలంటీర్లను నియమించి, వారికి ఇచ్చే గౌరవ వేతనం విషయాలను చర్చించారు. భవిష్యత్తులో ఏర్పడే నియామకాలలో ఇక్కడ ఉన్న ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. వారితో పాటు CRP సమి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.