గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్‌లో తోలు షాపు కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఎలక్ట్రిషన్ మృతి, విచారణ చేపట్టిన పోలీసులు
గుత్తిఆర్ఎస్ లోని తోళ్ల షాపు కాలనీలో ఆదివారం ఇంటిలో అనుమానస్పద స్థితిలో ఎలక్ట్రిషన్ మస్తాన్ మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో గమనించిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు దర్యాప్తు చేపట్టారు.