కడప జిల్లా కడప నగరంలోని అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఆధ్వర్యంలో మేళ తాళాల నడుమ గంధాన్ని ఊరేగింపు చేపట్టారు. అనంతరం దర్గాకు తీసుకు వచ్చి ముజావర్ల వద్ద ప్రార్థనలు నిర్వహించారు.ఈ గంథమహోత్సవంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రెహమాన్ పాల్గొని ప్రార్ధనలు నిర్వహించారు. ఆయన ప్రతి సంవత్సరం అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటూ వస్తున్నారు.