ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగాదేవి పల్లి గ్రామంలో తుపాన్ కారణంగా నీట మునిగిన పొగాకు పత్తి పంటలను వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెంటనే సంబంధిత అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.