భూపాలపల్లి: మోటివేషన్ క్లాసులపేరుతో మతమార్పిడికి యత్నం చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేయాలి : బజరంగ్ విశ్వహిందూ పరిషత్
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం 11 గంటలకు విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ హాస్టల్ విద్యార్థినిలను అధికారులకు సమాచారం లేకుండా తన ఇంటికి తీసుకువచ్చి మోటివేషన్ క్లాసులపేరుతో మతమార్పిడికి ప్రయత్నం చేసే యత్నం చేశారని దాన్ని భగ్నం చేసినట్లు తెలిపారు. ఇలాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.