కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం గ్రామంలో గురువారం రాత్రి ఆ ప్రాంత ప్రజలకు ఎస్సై మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం తెలపాలని గ్రామ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తమ ఇంటికి తాళం వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తమ స్వగృహంలో విలువైన, నగలు, డబ్బులు జాగ్రత్త వహించాలని గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గృహాల్లో చేరితే వారిపట్ల జాగ్రత్త వహించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాబయ్య స్థానిక పోలీసులు పాల్గొన్నారు