ఇబ్రహీంపట్నం: తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే రాజేంద్రనగర్ మెట్రో సాధిస్తాం : రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ మెట్రో కు నిధులు కేటాయించి టెండర్లు అయిపోయి కాంట్రాక్ట్ పనులు మొదలైన ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. దీనికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బాధ్యత వహించి జవాబు చెప్పాలని తెలిపారు. కానీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. వచ్చేది మన ప్రభుత్వమే అని రాజేంద్రనగర్ మెట్రో సాధిస్తామని తెలిపారు.