జీలుగుమిల్లిలో సీఐ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం, జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని వెల్లడి
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టి.నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని సీఐ వెంకటేశ్వరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.