సర్వేపల్లి: సైదాపురం ఎస్సై మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు : దళితులు ఎస్పీకి ఫిర్యాదు
తమకు కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి వల్ల ప్రాణహాని ఉందనో, సైదాపురం ఎస్సై తమ పై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ PGRS లో సైదాపురం గ్రామ అరుంధతీయ వాడకు చెందిన ముగ్గురు దళిత రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అరుంధతీయ వాడకు చెందిన నక్కిబోయిన వెంకటేశ్వర్లు,మల్లవరపు చిన్న పెంచలయ్య,వరికూటి శంకరయ్యలు మాట్లాడుతూ..నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన కర్లపూడి హరిప్రసాద్ అనే వ్యక్తి పొలం వదిలి వెళ్లకుంటే తమను చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని సోమవారం సాయంత్రం మూడు గంటలకు ఆవేధన వ్యక్తం చేశారు