మంత్రాలయం: కౌతాళం మండలంలోని క్యాంప్- గోతులదొడ్డి మధ్యలో వంకపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై వరి ధాన్యంతో వెళ్తున్న లారీ బోల్తా
కౌతాళం మండలంలోని క్యాంప్- గోతులదొడ్డి మధ్యలో వంకపై నిర్మించిన తాత్కాలిక వంతెనపై వరి ధాన్యంతో వెళ్తున్న లారీ ఆదివారం పల్టీ కొట్టింది. వాగుపై వంతెన నిర్మాణంలో ఉండడంలో ఇక్కడి తాత్కాలిక రహదారి ఇరుకుగా ఉండడంతో లారీ సైడుకు వెళ్లి పల్టీకొట్టింది. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.